ఏపి ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

డాక్టర్ సుధాకర్‌ను కోర్టులో హాజరు పరచండి

ap high court
ap high court

అమరావతి: ఏపి హైకోర్టు జగన్‌ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. విశాఖపట్టణానికి చెందిన అనెస్తీషియా వైద్యుడు డాక్టర్ సుధాకర్‌ విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై వీడియో క్లిప్పింగును జతచేస్తూ టిడిపి మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత రాసిన లేఖను ఏపి హైకోర్టు సుమోటో పిల్‌గా స్వీకరించింది. దీనిని విచారించిన ధర్మాసనం డాక్టర్ సుధాకర్‌ను తమ ఎదుట హాజరు పరచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ డాక్టర్ సుధాకర్ అంశాన్ని పార్టీలు రాజకీయం చేయాలని చూస్తున్నాయని అన్నారు. హైకోర్టుకు అనిత పంపినది ఎడిట్ చేసిన వీడియో అని.. ప్రధానిని, ముఖ్యమంత్రిని సుధాకర్ దూషించిన వీడియోలను లేఖతో ఎందుకు జతచేయలేదని ప్రశ్నించారు. కాగా పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణను రేపటికి వాయిదా వేసింది.


తాజా కరోనా లాక్‌డౌన్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/corona-lock-down-updates/