డబ్ల్యూహెచ్‌ఓను హెచ్చరించిన ట్రంప్‌

తాత్యాలికంగా నిలిపివేసిన నిధుల్ని శాశ్వాతంగా ఆపేస్తాం

trump-tedros adhanom

వాషింగ్టన్‌: ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) రాబోయే 30 రోజుల్లో తన విధానాలను మార్చుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్‌ ట్రంప్‌ హెచ్చరించారు. లేకుంటే తాత్కాలికంగా నిలిపివేసిన నిధుల్ని శాశ్వతంగా ఆపేస్తామని వ్యాఖ్యానించారు. అలాగే సంస్థలో అమెరికా సభ్యత్వంపై పునరాలోచించుకోవాల్సి వస్తుందని అన్నారు. కరోనా మహమ్మారిని కప్పిపుచ్చుతూ చైనాకు మద్దతునిస్తోందని, తన అధికారాలను దుర్వినియోగం చేస్తోందని ఆరోపిస్తూ ఏప్రిల్‌ మధ్యలో డబ్ల్యుహెచ్‌ఒకు నిధులను నిలిపివేసిన సంగతి తెలిసిందే. సోమవారం డబ్ల్యుహెచ్‌ఒ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధనామ్‌కు పంపిన లేఖను ట్వీట్‌ చేస్తూ.. తన స్వీయ వివరణగా ట్రంప్‌ పేర్కొన్నారు. వైరస్‌ పుట్టుక గురించి ముందస్తు నివేదికలు వస్తున్నా పట్టించుకోకుండా చైనాకు మద్దతునివ్వడం డబ్ల్యుహెచ్‌ఒ లోపాలకు నిదర్శనమని లేఖలో పేర్కొన్నారు.


తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/