అమ్మఒడి పేరిట బెదిరించి వసూళ్లు

వైఎస్‌ఆర్‌సిపి నేతలపై చంద్రబాబు ఆరోపణలు

Chandrababu Naidu
Chandrababu Naidu

అమరావతి: ఏపిలో సిఎం జగన్‌ ప్రభుత్వం పై టిడిపి అధినేత చంద్రబాబు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఆయన తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం పై విరుచుకుపడ్డారు. అమ్మఒడిగ పేరిట బెదిరించి వసూళ్లకు పాల్పడుతున్నారని వైఎస్‌ఆర్‌సిపి నాయకులపై చంద్రబాబు ఆరోపణలు చేస్తూ.. బిడ్డలూ, అమ్మలూ.. కాస్త జాగ్రత్త! అని పిలుపు నిస్తూ వరుస ట్వీట్లు చేశారు.అమ్మఒడి పేరిట అమ్మలను బెదిరించి నుంచి ఒక్కొక్కరి నుంచి వెయ్యి రూపాయలు వసూళ్లు చేస్తున్నారంటూ టిడిపి అధినేత చంద్రబాబునాయుడు ఆరోపించారు. ఆ వెయ్యి రూపాయలు తమకు ఇవ్వకపోతే ఈ పథకం కింద వచ్చే మొత్తం డబ్బును ఆపేస్తామని వైఎస్‌ఆర్‌సిపి నాయకులు బెదిరిస్తున్నారని ఆరోపిస్తూ వరుస ట్వీట్లు చేశారు. వసూలు చేసిన డబ్బుకు రశీదు కూడా ఇవ్వడం లేదంటే ఆ డబ్బు చేరేది వైఎస్‌ఆర్‌సిపి నేతల జేబుల్లోకేనని ప్రజలు అనుకుంటున్నారని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ ఖర్చు పేరిట పిల్లల దగ్గర కమిషన్లు కొట్టేసే దొంగమామలను ఇప్పుడే చూస్తున్నామంటూ సిఎం జగన్ పై చంద్రబాబు మండిపడ్డారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/