రైతులను సీఎం జగన్ ఎందుకు కలవడం లేదు?
జీఎన్‌రావు, బీసీజీ కమిటీలు ప్రజల అభిప్రాయాలు తీసుకోలేదు

గుంటూరు: అమరావతి రాజధాని కోసం నెల రోజులకుపైగా రాజధాని రైతులు, మహిళలు ఆందోళనలు చేస్తున్నా వారిని ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి ఎందుకు కలవలేదని టిడిపి ఎంపీ గల్లా జయదేవ్ ప్రశ్నించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మూడు రాజధానుల ప్రయోగం విఫలమైందని..సౌతాఫ్రికా ప్రతినిధులు చెబుతున్నారని అన్నారు. జీఎన్ రావు, బీసీజీ కమిటీలు ప్రజల అభిప్రాయాలు తీసుకులేదని జయదేవ్ విమర్శించారు. రైతుల అభిప్రాయాలు ఎందుకు తీసుకోలేదని కోర్టులు కూడా ప్రశ్నిస్తున్నాయని అన్నారు. రైతులు తమ గోడు చెప్పుకోవడానికి వస్తున్న రైతులను, ప్రజాప్రతినిధులను అడ్డుకున్నారని పోలీసులపై రాళ్లు వేశామంటూ తమపై పోలీసులు లాఠీచార్జ్ చేశారని చెప్పారు. రాళ్లు వేశానని తనపై కేసులు పెట్టారని, తనను రక్షించేందుకు ప్రయత్నించిన కొందరు మహిళలు కూడా గాయపడ్డారని జయదేవ్ ఆవేదన వ్యక్తం చేశారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/