పరిస్థితులు అర్థం చేసుకోవాలని టిడిపి నేతలకు చంద్రబాబు సూచన

tdp-chandrababu

న్యూఢిల్లీః బిజెపితో పొత్తు కుదిరిన నేపథ్యంలో, టిడిపి అధినేత చంద్రబాబు ఢిల్లీ నుంచి పార్టీ నేతలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. బిజెపితో పొత్తు ఖరారైందని పార్టీ నేతలకు చెప్పారు. కాసేపట్లో టీడీపీ, జనసేన, బిజెపి పార్టీల నుంచి ఉమ్మడి ప్రకటన వస్తుందనితెలిపారు. బిజెపితో పొత్తు కుదుర్చుకోవాల్సిన ఆవశ్యకతను చంద్రబాబు తమ పార్టీ నేతలకు వివరించారు. రాష్ట్రంలో పరిస్థితులను అర్థం చేసుకోవాలని నేతలకు సూచించారు.

ప్రస్తుతం చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ ఢిల్లీలోనే ఉన్నారు. వారిరువురు మరోసారి బిజెపి అగ్రనేతలతో సమావేశమై సీట్ల పంపకంపై చర్చించి, తుది నిర్ణయం తీసుకోనున్నారు.