పోసాని ఇంటిపై రాళ్ల దాడి

పోసాని ఇంటిపై రాళ్ల దాడి

నటుడు పోసాని ఇంటి ఫై దుండగులు రాళ్ల దాడి చేసారు. హైదరాబాద్ లోని ఎల్లారెడ్డి గూడా లో ఉన్న పోసాని ఇంటిపై కొంతమంది దుండగులు రాళ్ల దాడి చేసారు. ప్రస్తుతం పోలీసులు పోసాని ఇంటికి చేరుకొని సీసీ ఫుటేజ్ పరిశీలిస్తున్నారు. అయితే గత కొన్ని నెలలుగా పోసాని కుటుంబం ఇక్కడ ఉండడం లేదు. వాచ్ మెన్ మాత్రమే ఇక్కడ ఉంటున్నారు. రాళ్ల దాడి జరగడం తో వారు ఖంగారుపడి , పోసాని కి విషయం తెలియజేసారు. పోసాని పోలీసులకు పిర్యాదు చేయడం తో పోలీసులు చేరుకున్నారు. ప్రస్తుతం SR నగర్ లో పోసాని కేసు నమోదు చేసారు.

రెండు రోజుల క్రితం పోసాని ..పవన్ కళ్యాణ్ ఫై తీవ్రపదజాలం తో కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ప్రెస్ మీట్ ఏర్పటు చేసి పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం ఫై పోసాని చేసిన వ్యాఖ్యలకు అభిమానులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఆ సమయంలోనే పోసాని ఫై దాడికి అభిమానులు ట్రై చేసారు. ఆ తర్వాత కూడా మీడియా ముఖంగా కూడా కొంతమంది అభిమానులు పోసాని కి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు పోసాని ఇంటిపై దాడి చేసింది అభిమానులేనా…లేక మరొకరా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.