అవినీతికి తాము దూరమన్న అంబటి

ఎలాంటి విచారణకైనా సిద్ధంగా ఉన్నాను..అంబటి

ambati rambabu
ambati rambabu

అమరావతి: అంబటి రాంబాబు అక్రమ మైనింగ్ చేస్తున్నారంటూ నమోదైన పిల్‌పై ఆయన స్పందించారు. తనపై వచ్చిన ఆరోపణలపై ఏ స్థాయి విచారణకైనా తాను సిద్ధమేనని చెప్పారు. రెండు రోజుల క్రితం ఆయన మాట్లాడుతూ, అక్రమ మైనింగ్ చేసినవారే పిటిషన్ వేసి తనను అల్లరి చేయాలని ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. దీనిపై తమ వ్యతిరేక మీడియా, విపక్ష పార్టీలు దుష్ప్రచారం చేస్తున్నాయని అన్నారు. అక్రమాలకు, అవినీతికి తాము దూరమని చెప్పారు. వాస్తవాలు నిదానంగా బయటకు వస్తాయని చెప్పారు. కాగా ఈ అంశానికి సంబంధించి హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలైంది.

మరోవైపు దళితులపై దాడి అంశంపై ప్రసావించిన అంబటి… దళితులపై దాడులు చేసిన వారి తాట తీస్తామని సిఎం జగన్‌ హెచ్చరించారనీ… దళితులపై దాడులు చేసిన వారిని పోలీసులు వెంటనే అరెస్ట్ చేశారని అన్నారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/