మీరు కీర్తి, సంపదలతో వర్ధిల్లాలి: చంద్ర‌బాబు

రామ్మోహ‌న్ నాయుడికి జన్మదిన శుభాకాంక్షలు

అమరావతి: టీడీపీ ఎంపీ రామ్మోహ‌న్ నాయుడి పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఆయ‌న‌కు శుభాకాంక్షలు తెలుపుతూ ఆయ‌న‌పై ఆ పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించారు. ‘ టీడీపీ యువనేత, పార్లమెంటు సభ్యుడు రామ్మోహ‌న్ నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఒక ఎంపీగా జాతీయ స్థాయిలో రాష్ట్ర సమస్యలను చర్చకు తెచ్చేందుకు మీరు చూపుతున్న చొరవ, శ్రద్ధ ప్రశంసనీయం. మీరు ఇలాంటి మరెన్నో పుట్టినరోజులను ఘనంగా జరుపుకోవాలని… నిండు నూరేళ్లూ మీరు ఆనంద ఆరోగ్యాలతో, కీర్తి సంపదలతో వర్ధిల్లాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను’ అని చంద్ర‌బాబు నాయుడు ట్వీట్ చేశారు.

‘రామ్మోహ‌న్ నాయుడుకి ప‌లువురు టీడీపీ నేత‌లు కూడా పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలిపారు. టీడీపీ పార్లమెంటు సభ్యుడు, సోదరుడు రామ్మోహ‌న్ నాయుడుకు జన్మదిన శుభాకాంక్షలు. తెలుగు ప్రజల గొంతుకను జాతీయస్థాయిలో బలంగా వినిపించే టీడీపీ యువ ప్రతినిధిగా… మీరు ఉజ్వలమైన ప్రజాజీవితాన్ని, సంపూర్ణ ఆయురారోగ్యాలను అందుకోవాలని మనసారా కోరుకుంటున్నాను’ అని టీడీపీ నేత నారా లోకేశ్ ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/