విశాఖలో దీక్ష చేపట్టిన జనసేన

విశాఖపట్నం: ఏపీ ఎంపీలు విశాఖ ఉక్కు పరిరక్షణకు ఉద్యమించాలంటూ జనసేన దీక్ష చేపట్టింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైస్సార్సీపీ నేతలు చేసింది పాదయాత్ర కాదని.. స్థానిక ఎన్నికల ప్రచార యాత్ర అని ఆరోపించారు. జనసేన అధికార ప్రతినిధి శివశంకర్ మాట్లాడుతూ.. ప్రైవేటీకరణకు పైకి వ్యతిరేకమంటూనే లోపాయకారంగా మద్దతిస్తున్నారని మండిపడ్డారు.

అఖిలపక్షం ఏర్పాటు చేయడానికి ప్రభుత్వానికి అభ్యంతరం ఏంటని ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకునేందుకు తమకు ఎవ్వరి మద్దతు అవసరం లేదని వైస్సార్సీపీ కొత్త స్వరం అందుకుందన్నారు. డిజిటల్ క్యాంపైన్ చేయాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారని తెలిపారు. మూడు రోజులూ ఎంపీలు అందిరికీ కనువిప్పుకలిగేలా సోషల్ మీడియాతో ఒత్తిడి తేవాలని శివశంకర్ పిలుపునిచ్చారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/