హాస్పటల్ లో జాయిన్ అయినా చలాకీ చంటి..

జబర్దస్త్ ఫేమ్ చలాకీ చంటి హాస్పటల్ లో చేరినట్లు తెలుస్తుంది. జబర్దస్త్ షో తో ఎంతో గుర్తింపు తెచ్చుకున్న చంటి..ఆ తర్వాత బిగ్ బాస్ షో లో పాల్గొని ప్రేక్షకులను అలరించాడు. ఆ తర్వాత పెద్దగా కనిపించలేదు. తాజాగా ఈయన అనారోగ్యం బారినపడినట్లు తెలుస్తుంది.

సీరియస్ హార్ట్ స్ట్రోక్ తో ఆసుపత్రిలో చేరినట్లు మీడియా వర్గాల సమాచారం. ఆయన కండిషన్ ప్రస్తుతం సీరియస్ గానే ఉందని డాక్టర్లు చెప్పినట్లు తెలుస్తోంది. చిన్న వయసులో ఇలా ఆసుపత్రిలో చేరడం ఫ్యాన్స్ కి, కుటుంబ సభ్యులకు బాధ కలిగించే విషయం ఇది.

గత ఏడాది టెలికాస్ట్ అయిన బిగ్ బాస్ రియాల్టీ షోలో పాల్గొన్న చంటి బిగ్ బాస్ చివరి వరకు ఉండలేకపోయారు. కేవలం కొన్ని వారాలకే ఎలిమినేట్ అవ్వడం జరిగింది. బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత పెద్దగా బుల్లితెరపై కనిపించలేదు. అడపాదప షోలలో చేస్తూ ఉన్న చలాకీ చంటి పూర్తిగా స్క్రీన్ కు దూరం అవ్వడంతో దీంతో ఆయన అభిమానులు చలాకి చంటి కి ఏమైందో అంటూ కంగారుపడుతున్నారు. ఇలాంటి సమయంలోనే చలాకీ చంటి హాస్పిటల్లో చేరారని అని వార్త వినగానే అభిమానులు కాస్త ఆందోళన చెందుతున్నారు.