నేడు వరంగల్ లో ఏజెంట్ ప్రీ రిలీజ్ ఈవెంట్

అక్కినేని అఖిల్ నటిస్తున్న ఏజెంట్ మూవీకి సంబదించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు వరంగల్ లో జరగనుంది. ఏజెంట్ మూవీ కోసం అక్కినేని ఫ్యాన్స్ వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. చిత్రసీమలోకి హీరోగా అడుగుపెట్టి చాలాకాలం అవుతున్న ఇంతవరకు అఖిల్ కమర్షియల్ హిట్ కొట్టలేకపోయారు. అఖిల్ నటించిన గత చిత్రం మోస్ట్ బ్యాచ్లర్ సైతం యావరేజ్ తోనే సరిపెట్టుకుంది.

దీంతో ఏజెంట్ మూవీ ఫై అందర్నీలో ఆశలు పెరిగాయి. ఏప్రిల్ 28న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానున్న తరుణంలో మేకర్స్ సినిమా తాలూకా అప్డేట్స్ ఇస్తూ సినిమా ఫై అంచనాలు పెంచేస్తున్నారు. రీసెంట్ గా పలు సాంగ్స్ విడుదల చేసి ఆకట్టుకోగా, నేడు వరంగల్‌ లో ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ను నిర్వహించబోతున్నారు. ఈ ఈవెంట్‌ కు అక్కినేని నాగార్జున ముఖ్య అతిధిగా హాజరుకాబోతున్నారు. ఇక ఈ చిత్రానికి హిప్ హప్ తమీజా సంగీతాన్ని సమకూర్చారు. ఏజెంట్ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి వక్కంతం వంశీ కథ అందిస్తుండగా.. మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాగే మురళీ శర్మ, పోసాని కృష్ణమురళి ఇతర కీలక పాత్రలలో నటిస్తున్నారు.