జగన్ సర్కార్ పెంచిన పన్నులపై నారా లోకేష్ ఆగ్రహం

Corona positive to Lokesh
Nara Lokesh

జగన్ సర్కార్ పెంచిన పన్నులపై తెలుగుదేశం నేత నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేసారు. గత కొద్దీ రోజులుగా రాష్ట్ర సర్కార్ విధిస్తున్న పన్నుల ఫై ప్రతిపక్ష పార్టీ లు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో నారా లోకేష్ ఆర్టీసీ చార్జీల పెంపు ఫై ట్విట్టర్ ద్వారా జగన్ సర్కార్ తీరుపట్ల మండిపడ్డారు.

జగన్‌ మాటలు వింటుంటే గాలి పీల్చినా… వదిలినా పన్ను వేసేలా ఉన్నారని లోకేష్ ఎద్దేవా చేశారు. ‘కాదేది బాదుడే బాదుడుకు అనర్హం’ అన్నట్టుగా వైకాపా ప్రభుత్వం తీరు ఉందని విమర్శించారు. సామాన్యుడిపై పన్నుల పెంపు భారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. మూడేళ్లలో రెండుసార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచడం దారుణమని లోకేశ్ వ్యాఖ్యానించారు. ఛార్జీల పెంపు నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

.@ysjagan గారి స్పీడ్ చూస్తుంటే..గాలి పీల్చినా, వదిలినా జే ట్యాక్స్ వసూలు చేసేలా ఉన్నారు. చెత్త పన్ను, ఇంటి పన్ను, విద్యుత్ ఛార్జీలు, పెట్రోల్, డీజిల్ ధరలు, ఇప్పుడు ఆర్టీసీ ఛార్జీలు కాదేది బాదుడే బాదుడు కి అనర్హం అంటోంది వైసిపి ప్రభుత్వం.(1/3)#BaadudeBaaduduByJagan pic.twitter.com/YYxC3a9zZM— Lokesh Nara (@naralokesh) April 13, 2022