కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపేందుకు సిద్ధం..

కేంద్ర ప్రభుత్వం ఉద్యోగస్తులకు , పెన్షన్ దారులకు తీపి కబురు అందించేందుకు సిద్దమైనట్లు తెలుస్తుంది. మరోసారి ఉద్యోగస్తులకు డియర్‌నెస్ అలవెన్స్‌ను (DA) పెంచబోతున్నట్లు సమాచారం. ఒకవేళ పెంచితే ఉద్యోగులకు పండగే. ఎందుకంటే DA పెంచితే, వేతనాలు కూడా పెరగనున్నాయి. అలాగే పెన్షన్ పొందే వారికి ఊరట కలుగుతుది.

కేంద్ర ప్రభుత్వం ఈ సారి డియర్‌నెస్ అలవెన్స్‌ను మరో 4 శాతం మేర పెంచొచ్చనే అంచనాలు ఉన్నాయి. ఇదే జరిగితే డియర్‌నెస్ అలవెన్స్ 46 శాతానికి చేరుతుంది. అప్పుడు దీనిక అనుగుణంగా ఉద్యోగులకు జీతాలు కూడా పెరుగుతాయి. జూలై 31న డీఏ ఎంత పెరగొచ్చనే అంశంపై ఒక స్పష్టత రావొచ్చు. ఎందుకంటే ఈ రోజున ఏఐసీపీఐ ఇండెక్స్ గణాంకాలు వెలువడాల్సి ఉంది. వీటి ఆధారంగా డీఏ ఎంత పెరగొచ్చనే విషయంలో ఒక అంచనాలకు రావొచ్చు. ప్రస్తుతం డీఏ 42 శాతంగా ఉంది. 2023 జనవరి నుంచి జూన్ కాలానికి ఈ డీఏ వర్తిస్తుంది. మరో 4 శాతం పెరిగితే ఇది 46 శాతానికి చేరుతుంది. ఇదే జరిగితే జూలై నుంచి డిసెంబర్ కాలానికి 46 శాతం డీఏ వర్తిస్తుంది.