మోరంచపల్లిలో మృతదేహాల వేట ఇంకా కొనసాగుతూనే ఉంది

మోరంచపల్లి మొన్నటి వరకు ఈ గ్రామం పేరు చెపితే ముందుగా పాల ఉత్పత్తి గురించి అంత మాట్లాడుకునేవారు. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఈ గ్రామంలో పాల ఉత్పత్తి చేస్తుంటారు. ఇక్కడి గ్రామస్తులంతా కూడా పాలను నమ్ముకునే జీవనం కొనసాగిస్తుంటారు. ప్రతి ఇంటికి పదుల సంఖ్య లో పాడిపశువుల ఉంటాయి. అలాంటి మోరంచపల్లి ఇప్పుడు ఎడారిలా మారిపోయింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మోరంచపల్లి గ్రామాన్ని వరదలు చుట్టేసాయి. గ్రామం అంత వరదలో మునిగిపోయింది. పదుల సంఖ్యలో పాడిపశువుల మరణించాయి. ఇల్లులు కూలిపోయాయి. పొలాల్లోకి భారీగా ఇసుకచేరింది.

వరదలకు ఇల్లు వాకిలి వదిలిపెట్టి ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ప్రజలంతా ఊరు వదిలిపెట్టి వెళ్లిపోయారు. వరదలు తగ్గుముఖం పట్టిన తర్వాత గ్రామంలోకి వెళ్లి చేస్తే ఏమిలేదు. ఇల్లు వాకిలి అంత బురదలో కూరుకుపోయాయి. ఇళ్లముందు కట్టేసిన పశువులు మృతిచెందాయి. ఇంటి ముందు పార్క్ చేసిన వాహనాలు కొట్టుకుపోయాయి. వారికంటూ ఏమిలేకుండా చేసాయి భారీ వరదలు. నాలుగు రోజుల క్రితం వరద ఉధృతిలో కొట్టుకుపోయిన వారిలో ఇప్పటివరకు ముగ్గురి ఆచూకీ లభించింది. కాగా, మరొకరి ఆచూకీ లభించాల్సి ఉంది. మొత్తం నలుగురికి గాను రెండు మృతదేహాలు శనివారం లభించగా…మరో మహిళ మృతదేహం ఆదివారం రాత్రి భూపాలపల్లి మండలం నేరేడుపల్లి సమీప చిర్రవంట చెరువువద్ద కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వజ్రమ్మతోపాటు కొట్టుకుపోయిన గడ్డం మహాలక్ష్మి ఆచూకీ ఇంకా లభించలేదు. ఆమె కోసం జిల్లాలోని మోరంచవాగు, మానేరువాగు పరీవాహక ప్రాంతాలతోపాటు భూపాలపల్లి, చిట్యాల, మల్హర్‌ మండలాల పోలీసులు డ్రోన్‌ల ద్వారా సమీప గ్రామాల్లోని ప్రజలతో గాలింపు చర్యలు చేపడుతున్నారు. ప్రస్తుతం తమను ఆదుకోవాలని మోరంచపల్లి గ్రామస్థులు ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు.