హుజురాబాద్ లో మధ్యాహ్నం 1 గంటవరకు పోలింగ్ శాతం

హైదరాబాద్: హుజురాబాద్ నియోజకవర్గంలో భారీగా పోలింగ్‌ నమోదవుతున్నది. మధ్యాహ్నం 1 గంటవరకు 45.63 శాతం పోలింగ్ నమోదైంది. నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. హుజురాబాద్ మండలంలో 45.05, వీణవంక 47.65, జమ్మికుంటా 45.36, ఇళ్లందకుంటా 42.09,కమలపూర్ 46.73 శాతం పోలింగ్ నమోదు అయినట్లు అధికారలు వెల్లడించారు. సాయంత్రం 7 గంటల వరకు ఓటింగ్‌ కొనసాగనుంది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/