తెలంగాణలో జాతీయ అంటువ్యాధుల నియంత్రణ సంస్థ

National Centre for Disease Control
National Centre for Disease Control

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో జాతీయ అంటువాధ్యుల నియంత్రణ సంస్థ(ఎన్‌సిడిసి) ఏర్పాటుకు గానూ కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. త్వరలోనే రాష్ట్రంలో ఎన్‌సిడిసి బ్రాంచ్‌ను ఏర్పాటు చేస్తామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్దన్ పార్లమెంట్‌లో ప్రకటించారు. దీన్ని హైదరాబాద్‌లో నెలకొల్పే అవకాశం ఉంది. ఇందుకోసం కేంద్ర ఆరోగ్య శాఖ అధికారుల బృందం గత డిసెంబర్‌‌లోనే నగరానికి వచ్చింది. ఎన్‌సిడిసి ఏర్పాటు కోసం స్థలాలను పరిశీలించింది. కోఠిలోని ప్రజారోగ్య సంచాలకుల కార్యాలయ ఆవరణలో ఉన్న ఓ భవనాన్ని కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నట్టు రాష్ట ప్రభుత్వం ఆ బృందానికి తెలిపింది. అయితే, ఆ భవనం ఎన్‌సిడిసికి అనువుగా లేదని అధికారుల బృందం పేర్కొన్నది.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/