బీరు ప్రియులకు జేబుకు చిల్లు అయ్యే వార్త

ఎండలు దంచికొడుతున్నాయి..బయట కాలు పెట్టాలంటే వణిపోతున్నారు.ఇక మందు బాబులైతే ఈ ఎండ తీవ్రత నుండి బయటపడేందుకు బీర్లను తెగ తాగేస్తున్నారు. అయితే ఈ తరుణంలో వారి జేబులకు చిల్లు పెట్టేందుకు ఎక్సైజ్ శాఖ సిద్దమవుతుంది. తెలంగాణ రాష్ట్రంలో బీర్ల ధరలను పెంచేందుకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అన్ని బ్రాండ్లపై ఒక్క బీరు ధర రూ.10 నుంచి 20 రూపాయల పెంచాలని చూస్తున్నారు.

దీనిపై త్వరలోనే ఉత్తర్వులు వెలువడనున్నాయి. ప్రస్తుతం లైట్ బీట్ బీర్ ధర.140 రూపాయలు ఉండగా అది 150కి , స్ట్రాంగ్ బీరు ధర 150 ఉండగా.. 160 కి పెరగనున్నట్లు సమాచారం. గతేడాది మే నెలతో పోల్చితే ఈ వేసవి సీజన్లో బీర్ల అమ్మకాలు 90 శాతం ఎక్కువగా రాష్ట్రంలో నమోదయ్యాయి. బీర్ల అమ్మకాలలో రంగారెడ్డి జిల్లా ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది.ఆ జిల్లాలో 2.38 కోట్ల లీటర్ల బీరు విక్రయం జరిగింది.1.15 కోట్ల లీటర్ల బీరు విక్రయం తో వరంగల్ సెకండ్ ప్లేస్ లో ఉంది.