ఆఫ్ఘన్‌లోయుద్ధ నేరాలపై దర్యాప్తుకు ఆమోదం
ధ్రువీకరించిన అంతర్జాతీయ న్యాయస్థానం

జెనీవా: ఆఫ్ఘనిస్తాన్‌లో రెండు దశాబ్దాలుగా అమెరికా సాగిస్తూ వస్తున్న యుద్ధ నేరాలపై దర్యాప్తునకు అంతర్జాతీయ కోర్టు ఆమోదం తెలిపింది. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ఐసిసి) అప్పిలేట్ ప్యానెల్ చీఫ్ ప్రాసిక్యూటర్ ఫాతూ బెన్సూడా మాట్లాడుతూ, ‘ఈ రోజు చాలా ముఖ్యమైన రోజు. ఆఫ్ఘనిస్తాన్‌కు న్యాయం జరిగే రోజు’ అని వ్యాఖ్యానించారు. గాంబియా సంతతికి చెందిన బెన్సూడా ఈ కేసులో దర్యాప్తు కోసం పోరాడినందుకు ఆమె వీసాను అమెరికా రద్దు చేసిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయ న్యాయ స్థానం ఇచ్చిన రూలింగ్‌ను ఆమె ప్రశంసించారు. అమెరి కా, ఆఫ్ఘనిస్తాన్‌లోని దాని కీలుబొమ్మ ప్రభుత్వం యథేచ్ఛ గా యుద్ధ నేరాలకు తెగబడ్డాయి. వీటిపై దర్యాప్తు నకు సహకరించేందుకు అమెరికా, ఆఫ్ఘన్ ప్రభుత్వం రెండూ నిరాకరిస్తూ వస్తుండడంతో ఐసిసి జోక్యం చేసుకుని ఈ రూలింగ్ ఇచ్చింది. ఐసిసి ప్రి ట్రయల్ న్యాయమూర్తులు గత ఏడాది తీసుకున్న నిర్ణయా న్ని ఐసిసి తాజా రూలింగ్ తోసిపుచ్చింది. ఆర్థిక ఆంక్షలు, దర్యాప్తు బృంద సభ్యులను అరెస్టు చేయడం వంటి ప్రతీకార చర్యలకు పాల్పడతామని అమెరికా నుంచి వచ్చిన బెదిరింపుల నేపథ్యంలో ఐసిసి ప్రి ట్రయల్ న్యాయమూర్తులు ఆ నిర్ణయం తీసుకున్నట్లుగా ఉందని, ఐసిసి నిబంధనలకు ఇది పూర్తి విరుద్ధమని ఐసిసి అప్పిలేట్ ప్యానెల్ న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు.
తాజా వీడియోస్ కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/videos/