షారుఖ్ పఠాన్ చిత్రానికి షాక్ ఇచ్చిన సెన్సార్

షారుఖ్ తాజా చిత్రం పఠాన్ కు సెన్సార్ బృందం షాక్ ఇచ్చింది. షారుఖ్ ఖాన్ – దీపికా పదుకొనె జంటగా సిద్దార్థ్ ఆనంద్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న మూవీ ‘పఠాన్’. ఈ మూవీలోని ఫస్ట్ సింగిల్ ‘బేషరమ్ రంగ్’ సాంగ్ రిలీజ్ అయ్యి..ఎంత వివాదం సృష్టించిందో చెప్పాల్సిన పనిలేదు. ఏకంగా షారుఖ్ ఖాన్..ను కాల్చేస్తామంటూ రాజకీయ నేతలు హెచ్చరించారు. ముఖ్యంగా ఈ సాంగ్ లో దీపికా అందాల ఆరబోత చేయడం , కాషాయం రంగులో ఉన్న బికినీ ధరించడం పట్ల చాలామంది ఆగ్రహం వ్యక్తం చేసారు. వీటిని సినిమాలో నుండి తొలగించకపోతే అడ్డుకుంటామని హెచ్చరించారు.

ఇప్పుడు సెన్సార్ సైతం వీటిపై అభ్యంతరాలు తెలిపింది. దీపిక బికినీ సహా పాటలో ఆమె అందాల ఆరబోత పై అభ్యంతరం వ్యక్తం చేసింది. పాటలో మార్పులు చేయాలని సెన్సార్ బోర్డ్ మేకర్స్ ను కోరింది. ఖచ్చితంగా సెన్సార్ నిబంధలను పాటించి తీరాలని ఆదేశాలిచ్చింది. దాంతో ఈ పాటలో మార్పులు చేసే అవకాశం కనిపిస్తుంది. ఇక హీరోగా షారుక్ సినిమా చేసి చాలా కాలం అయ్యింది. చివరిగా షారుక్ నటిస్తోన్న సినిమా జీరో. ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొట్టింది. ఆ తర్వాత షారుక్ చాలా గ్యాప్ తీసుకున్నారు. మధ్యలో ఒకటి రెండు సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించాడు. ఇక వచ్చే ఏడాది రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు షారుక్. వాటిలో పఠాన్ సినిమా ఒకటి . యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది.