సీతారామం చిత్రంతో 18 పేజెస్ ను పోల్చిన మెగా ప్రొడ్యూసర్

2022 లో ఫీల్ గుడ్ మూవీ గా సీతారామం నిలిచింది. దుల్కర్ సల్మాన్, మృణాల్‌ ఠాగూర్‌ జంటగా హనురాఘవాపుడి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. సినిమా చూస్తున్నంత సేపు ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. ముఖ్యంగా క్లైమాక్స్ ప్రేక్షకులను మరోసారి థియేటర్స్ కు వచ్చేలా చేసింది. అలాంటి మూవీ తో 18 పేజెస్ చిత్రాన్ని పోల్చాడు మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్.

కార్తికేయ 2 ఫేమ్ నిఖిల్ – అనుపమ జంటగా ప్రతాప్ తెరకెక్కించిన ప్రేమ కథ చిత్రం 18 పేజెస్. కార్తికేయ 2 తర్వాత నిఖిల్ నుండి వచ్చిన సినిమా కావడం..ప్రేమ కథ చిత్రంగా తెరకెక్కడం తో ప్రేక్షకులు భారీ అంచనాలే పెట్టుకున్నారు. వారి అంచనాలను పూర్తిస్థాయిలో అందుకోలేకపోయిన వన్ టైం వాచ్ మూవీ గా నిలబడింది. ఈ సినిమా సక్సెస్ అయినా నేపథ్యంలో చిత్ర యూనిట్ గురువారం సాయంత్రం హైదరాబాద్ లో సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ సక్సెస్ మీట్ కు చిత్ర యూనిట్ తో పాటు ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ హాజరయ్యారు.

ఈ సందర్భాంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ .. “ప్రేమకథలను ఇంట్లో కూర్చుని చూసేయవచ్చు అని అనుకుంటున్న తరుణంలో ‘సీతా రామం’ వచ్చింది .. అదరగొట్టేసింది. ‘సీతా రామం’ క్లైమాక్స్ లో ఉన్న ఆ ఫీల్ ఈ సినిమాలో కనిపించింది. చాలామంది ఆ సినిమాతో పోల్చి చెబుతుంటే నాకు చాలా సంతోషంగా ఉంది’ అన్నారు.

ఈ కథను విన్నప్పుడే ‘నవల’ చదువుతున్నట్టుగా ఉందే’ అనుకున్నాను. విజువల్ గా ఈ ఎఫెక్ట్ ను తీసుకురాగలమా అని నేను డైరెక్టర్ గారిని అడిగాను. ‘తప్పకుండా తీసుకొస్తాను సార్’ అని ఆయన కాన్ఫిడెంట్ గా చెప్పాడు. ఇప్పుడు ఈ సినిమా రెండో వారంలోకి ఎంటరవుతోంది. రిపీట్ ఆడియన్స్ వస్తే మూడో వారం కూడా కంటిన్యూ చేస్తాము. ఈ బ్యానర్ పై నిఖిల్ తో మరో రెండు సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నాము” అంటూ చెప్పుకొచ్చారు.