‘ జై సీబీఎన్’ నినాదాలతో మారుమోగిన గచ్చిబౌలి స్టేడియం

చంద్రబాబు విజన్‌తో నిర్మించిన సైబర్ టవర్స్‌కు 25 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా..చంద్రబాబుకు కృతజ్ఞత తెలిపేందుకు సీబీఎన్ గ్రాటిట్యూడ్ పేరిట గచ్చి బౌలి స్టేడియంలో సంగీత విభావరిని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి వేలాదిమంది ఐటీ ఉద్యోగులు , టిడిపి శ్రేణులు, అభిమానులు , నందమూరి కుటుంబ సభ్యులు హాజరయ్యారు. అలాగే పలువురు సినీ ప్రముఖులు సైతం హాజరై చంద్రబాబు కు సంఘీభావం తెలిపారు. సీబీఎన్ వెంటే తాము అంటూ నినాదాలతో స్టేడియం హోరెత్తింది.

నగర నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో ఐటీ ఉద్యోగులు, చంద్రబాబు అభిమానులు వేలాదిగా గచ్చిబౌలి మైదానానికి చేరుకొని ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. సైబర్‌ బాబుకు సంఘీభావంగా గళమెత్తారు. తమ జీవితాలకు దారి చూపిన దార్శనికుడిని జైలులో బంధించడం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం గెలిస్తుందనే నమ్మకం తమకు ఉందన్న ఐటీ ఉద్యోగులు… చంద్రబాబు అంటే పేరు మాత్రమే కాదని, అది ఒక బ్రాండ్ అంటూ నినదించారు. అందుకే ఆయన పట్ల గౌరవాన్ని చాటుకోడానికి సుమారు 1200 మంది ఉద్యోగులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి కార్యక్రమం కోసం ఎంతో కష్టపడ్డారని చెప్పారు.