వైస్సార్సీపీ కి బిగ్ షాక్ : టీడీపీ లో చేరిన ఎమ్మెల్యే ఆర్కే అనుచరుడు

ఏపీలో వలసలు మొదలయ్యాయా..అంటే అవుననే చెప్పాలి. గతంలో టీడీపీ నుండి పెద్ద ఎత్తున వైస్సార్సీపీ లో చేరిన నేతలు , కార్య కర్తలు..ఇప్పుడు మళ్లీ సొంత పార్టీ లో వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఎన్నికల సమయం నాటికీ పెద్ద ఎత్తున టీడీపీ , జనసేన పార్టీల్లో పెద్ద ఎత్తున నేతలు చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. తాజాగా ఎమ్మెల్యే ఆర్కే అనుచరుడు..నారా లోకేష్ సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.

తాడేపల్లి మండలం కుంచనపల్లికి చెందిన వైస్సార్సీపీ నేత, ఎమ్మెల్యే ఆర్కే అనుచరుడు గొర్ల వేణు గోపాల్ రెడ్డి , వైస్సార్సీపీ కార్యకర్తలు టీడీపీలో చేరారు. వారికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జగన్ అరాచక, అవినీతి పాలనపై అన్నివర్గాలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నాయన్నారు లోకేష్. దీనికి ఉదాహరణే టీడీపీలోకి చేరికలు అని వ్యాఖ్యానించారు.

వేణుగోపాల్ రెడ్డిని మనస్ఫూర్తిగా టీడీపీలోకి ఆహ్వానిస్తున్నానని.. పార్టీలో వేణుగోపాల్ రెడ్డికి సముచిత స్థానం, ఆయన అనుచరులకు గౌరవం కల్పిస్తామన్నారు. వేణు గోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు ఎంతో మంది కష్టపడితే వైస్సార్సీపీకి అధికారం దక్కిందని.. జగన్ జమానాలో నలుగురు మాత్రమే బాగుపడ్డారన్నారు. వేలమంది వేణుగోపాల్ రెడ్లు నష్టపోయారని లోకేష్ అన్నారు.