కవిత ఇంట్లోనే సిబిఐ విచారణ..

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవిత ను సీబీఐ అధికారుల ఈనెల 11న (ఆదివారం) ఉదయం 11 గంటలకు హైదరాబాద్ లోని తన నివాసంలో విచారించనున్నారు. మొదట కవిత కు ఇచ్చిన నోటీసుల ప్రకారం ఈరోజు సీబీఐ అధికారులు రావాల్సి ఉండగా.. ముందే షెడ్యూల్ చేసుకున్న కార్యక్రమాలుండటంతో.. వీలుకాదని కవిత లేఖ రాసింది. అయితే.. కవిత రాసిన లేఖకు అధికారుల నుంచి రిఫ్లై వచ్చింది.

కవిత కోరిన విధంగా…ఈ నెల 11 వ తేదీన ఆమెను విచారించబోతున్నట్లు తెలిపారు. ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని కవిత ఇంట్లో సీబీఐ అధికారుల బృందం భేటీ కానుంది. ఈ సమావేశంలో కవిత చెప్పిన స్టేట్‌మెంట్‌ను అధికారులు రికార్డు చేయనున్నారు.

మరోపక్క ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో శరత్ చంద్రా రెడ్డి , బినోయ్ బాబు ల జ్యుడిషియల్ కస్టడీని సీబీఐ ప్రత్యేక కోర్టు పొడిగించింది. సోమవారం తో జ్యుడిషియల్ రిమాండ్ గడువు ముగియడంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టులో హాజరుపరిచారు. దీనిపై వాదనలు విన్న కోర్టు డిసెంబర్ 19 వరకు జ్యుడిషియల్ రిమాండ్ ను పొడిగించింది. ఇక బెయిల్ మంజూరు కోసం శరత్ చంద్రారెడ్డి రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు. దీనిపై డిసెంబర్ 13న మధ్యాహ్నం 2 గంటలకు విచారణ జరిగింది.