దసరా పండుగ వేళ గుడ్ న్యూస్ చెప్పిన టీఎస్‌ఆర్టీసీ

తెలంగాణ లో అతి పెద్ద పండగ దసరా. ఈ పండగను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో సంబరంగా జరుపుకుంటారు. ప్రపంచంలో ఎక్కడన్నా సరే..ఈ పండగ వేళ తమ సొంతర్లకు వచ్చి కుటుంబ సభ్యులతో ఈ పండగను జరుపుకుంటారు. ఈ తరుణంలో TSRTC ప్రయాణికులకు ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక సర్వీస్ లతో పాటు పెద్ద ఎత్తున బస్సులు అందుబాటులో ఉండబోతున్నట్లు తెలిపింది. పట్టణాలు, నగరాల్లో ఉండేవారు తమ సొంతూర్లకు వెళ్లేందుకు ఏకంగా 5,265 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది.

అక్టోబర్ 13వ తేది నుంచి 25వ తేది వరకూ ఈ ప్రత్యేక బస్సులు ప్రయాణికులకు అందుబాటులో ఉండనున్నాయి. అక్టోబర్ 22వ తేదిన సద్దుల బతుకమ్మ, 23న మహార్ణవమి, 24న దసరాకు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండటంతో ఆయా రోజుల్లో అవసరాన్ని బట్టీ మరికొన్ని ప్రత్యేక బస్సులను కూడా నడపనున్నట్లు టీఎస్ఆర్టీసీ వెల్లడించింది. ఎంజీబీఎస్, జేబీఎస్, సీబీఎస్‌తో పాటు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండేటటువంటి కేపీహెచ్‌బీ కాలనీ, ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఉప్పల్ బస్టాండ్, దిల్‎సుఖ్ నగర్, ఎల్బీనగర్, ఆరాంఘర్, తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు తెలిపింది.