కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి

Former MLA Vittal Reddy joined Congress

హైదరాబాద్‌ః నిర్మల్ జిల్లా బిఆర్ఎస్ అధ్యక్షుడు, ముధోల్ మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. బిఆర్ఎస్ అధికారం కోల్పోయాక పలువురు నేతలు ఆ పార్టీని వీడుతున్నారు. తాజాగా విఠల్ రెడ్డి కూడా బిఆర్ఎస్‌కు రాజీనామా చేసి ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు సీతక్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదితరుల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. మంత్రి సీతక్క ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

విఠల్ రెడ్డి 2014లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత బీఆర్ఎస్‌లో చేరారు. 2018లోను బిఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలిచారు. 2023 ఎన్నికల్లో మళ్లీ బిఆర్ఎస్ నుంచి పోటీ చేసినప్పటికీ బిజెపి అభ్యర్థి రామారావు పవార్ చేతిలో ఓడిపోయారు. రామారావు పవార్ 24వేల మెజార్టీతో విజయం సాధించారు.