ధమ్కి నుండి “ఆల్ మోస్ట్ పడిపోయిందే పిల్లా” సాంగ్ రిలీజ్

ఓరి దేవుడా అంటూ రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన యంగ్ హీరో విశ్వక్ సేన్..ఇప్పుడు ‘దమ్కీ’ అంటూ రాబోతున్నాడు. స్వీయ దర్శకత్వంలో ..కామెడీ థ్రిల్లర్ మూవీగా రాబోతున్న ఈ చిత్రానికి బెజవాడ ప్రసన్నకుమార్ కథని సమకూరుస్తున్నాడు. ఇటీవలే బాలకృష్ణ చేతుల మీదుగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేసి ఆకట్టుకోగా..మంగళవారం చిత్రంలోని “ఆల్ మోస్ట్ పడిపోయిందే పిల్లా” అంటూ సాగే సాంగ్ ను రిలీజ్ చేసారు.

లియోన్ జేమ్స్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ ని డీజే టిల్లు ఫెమ్ సిద్దు జొన్నలగడ్డ చేతుల మీదుగా విడుదల చేశారు. బీచ్ లో సాగే ఈ సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంది. ఇక ఈ మూవీ ని తెలుగు, తమిళ ,మలయాళ , హిందీ భాషల్లో ఫిబ్రవరి 17వ తేదీన విడుదల కాబోతుంది. ఈ మూవీ లో విశ్వక్ సరసన నాయికగా నివేదా పేతురాజ్ అలరించనుంది.

YouTube video