డాక్టర్‌ సుధాకర్‌పై కేసు నమోదు చేసిన సీబీఐ

పలు సెక్షన్ల కింద సుధాకర్ కేసు నమోదు

CBI files case against Visakhapatnam Dr Sudhakar for creating

విశాఖపట్న: మత్తు వైద్యుడు డాక్టర్‌ సుధాకర్‌పై సీబీఐ కేసు నమోదు చేసింది. కేసుకు సంబంధించిన వివరాలను సీబీఐ తన వెబ్‌సైట్‌లో ఉంచింది. ఓ ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి నడిరోడ్డు మీద ప్రజాప్రతినిధులను దూషించడం, విధి నిర్వహణలో ఉన్న పోలీసులపైనా మాట తూలడం, ఓ కానిస్టేబుల్ మొబైల్‌ను కిందపడేయడం, తనకున్న అధికారాలతో న్యూసెన్స్ క్రియేట్ చేస్తూ స్థానికులను భయబ్రాంతులకు గురిచేసారని సీబీఐ ఆరోపిస్తూ కేసు పెట్టింది. 23 మంది సాక్షుల సమాచారంతో పాటు 130 పేజీలతో కూడిన సీడీ ఫైల్‌ను సీబీఐకి పోలీసులు అప్పగించారు. దీంతో వాటిని పరిశీలించి అతడిపై కేసు పెట్టారు. లాక్ డౌన్ సమయంలో నిబంధనలు ఉల్లంఘించినందుకు డాక్టర్ సుధాకర్‌పై సెక్షన్ 188 నమోదైంది. కాగా ఇప్పటికే పోలీసులపై సీబీఐ పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/