ఈనెల 11న ఏపి కేబినెట్‌ భేటి

నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ

AP CM YS Jagan
AP CM YS Jagan

అమరావతి: ఈనెల 11న ఏపి కేబినెనట్‌ సమావేశం కానుంది. సిఎం జగన్‌ నేతృత్వంలో 11న ఉదయం 11 గంటలకు ఏపి సచివాలయంలో ఈభేటి కానుంది. ఈ విషయంపై ఏపి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు. ఈ భేటీలో ముఖ్యంగా కరోనా గురించి చర్చించే అవకాశం ఉంది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో రాష్ట్రానికి వచ్చిన నష్టం, తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలు చర్చించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. పలు పథకాల అమలుపై కూడా చర్చించే అవకాశముంది. కాగా, కేబినెట్‌ భేటీలో చర్చించే అంశాలపై నివేదికలు పంపాలని ఏపిలోని అన్ని శాఖల అధికారులకు నీలం సాహ్ని సూచించారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/