ఈడీ దాడులు..మాజీ ఎమ్మెల్యే ఇంట్లో విదేశీ ఆయుధాలు, మద్యం.. రూ.5 కోట్లు సీజ్‌

cash-arms-found-in-raids-at-premises-of-ex-haryana-mla-associates-in-illegal-mining-case

న్యూఢిల్లీ: పంజాబ్‌, హర్యానాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అక్రమ మైనింగ్‌ వ్యవహారంలో దాడులు నిర్వహిస్తున్నది. రెండు రాష్ట్రాల్లో 20కిపైగా ప్రాంతాల్లో అధికారులు సోదాలు చేస్తున్నారు. ఈ క్రమంలో హర్యానాలోని ఇండియన్‌ నేషనల్‌ లోక్‌ దళ్‌ మాజీ ఎమ్మెల్యే దిల్‌బాగ్‌ సింగ్‌ ) నివాసంలో తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అక్రమ విదేశీ ఆయుధాలు, 300కుపైగా కార్ట్రిజ్‌లు, 100కుపైగా విదేశీ మద్యం బాటిళ్లు, రూ.5 కోట్లు, సుమారు 5 కేజీల బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. దిల్‌బాగ్‌తోపాటు అతని అనుచరుల ఇండ్లలోనూ తనిఖీలు చేస్తున్నారు. అదేవిధంగా కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సురీందర్‌ పన్వర్‌ ఇంట్లో కూడా సోదాలు చేశారు.