శరద్ పవార్ తో సోనూ సూద్ భేటీ
మర్యాదపూర్వకంగానే ఆయనతో భేటీ అయినట్లు సోనూ సూద్ వెల్లడి

Mumbai: ప్రముఖ నటుడు సోనూ సూద్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ తో భేటీ అయ్యారు. శరద్ పవార్ నివాసానికి వెళ్లి సోనూ సూద్ ఆయనను కలిశారు. దాదాపు అరగంట పాటు భేటీ జరిగింది.
ఈ భేటీలో వారు చర్చించిన విషయాలేమిటన్నది వెంటనే తెలియరాలేదు. భేటీ అనంతరం తాను మర్యాదపూర్వకంగానే ఆయనతో భేటీ అయినట్లు సోనూ సూద్ చెప్పారు.
అయితే సోనూ సూద్ తన నివాస భవనాన్ని ఎటువంటి అనుమతులూ లేకుండా హోటల్ గా మార్చారంటూ బృహన్ ముంబై కార్పొరేషన్ పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసిన నేపథ్యంలో శరద్ పవార్ తో సోనూసూద్ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
తాజా ‘మొగ్గ ‘(చిన్నారుల ప్రత్యేకం) కోసం : https://www.vaartha.com/specials/kids/