బేగంపేట ఫ్లైఓవర్ పై కారు బీభత్సం

బేగంపేట ఫ్లైఓవర్ పై కారు బీభత్సం సృష్టించింది. పంజాగుట్ట నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్తుండగా బేగంపేట ప్లై ఓవర్ పై డివైడర్ ను ఢీకొట్టింది. ఆ తరువాత ట్రావెల్స్ బస్సును ఢీకొని రివర్స్ లో ప్లై ఓవర్ వాల్ కు కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు అయింది. కారులోని డ్రైవర్ తో సహా మహిళకు గాయాలయ్యాయి.

ఈ ఘటనతో ప్లైఓవర్ పై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్లైఓవర్ ఫై ట్రాఫిక్ ను క్రమబద్దీకరించారు. అయితే, అతివేగం వల్లనే కారు అదుపు తప్పి ప్రమాదానికి గురైనట్లు పోలీసులు చెపుతున్నారు. మరి కారు లో ఉన్నవారి వివరాలు తెలియాల్సి ఉంది.