నక్కా ఆనందబాబు హౌస్ అరెస్ట్

టిడిపి పోలిట్ బ్యూరో సభ్యుడు నక్కా ఆనందబాబు హౌస్ అరెస్ట్ అయ్యాడు. రాజకీయ ఘర్షణల నేపథ్యంలో ఈరోజు మాచర్లలో టిడిపి అధ్యయన కమిటీ పర్యటించాల్సింది. కానీ పల్నాడు లో 144 సెక్షన్ అమల్లో ఉన్న పరిస్థితుల్లో టిడిపి నాయకుల మాచర్ల పర్యటనకు అనుమతి నిరాకరించారు పోలీసులు.

ఇందులో భాగంగా ముందస్తు జాగ్రత్తగా మాజీ మంత్రి నక్కా ఆనందబాబు హౌస్ అరెస్ట్ చేసారు పోలీసులు. ఇక అటు అన్నమయ్య జిల్లాలో హై అలర్ట్‌ ప్రకటించారు పోలీసులు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో వైసిపి నేతల ఇండ్ల పై జరిగిన దాడులపై అప్రమతమయ్యారు పోలీసులు. ఎలాంటి ఘర్షణలు జరగకుండా ఉండేందుకు ముందస్తు చర్యలలో భాగంగా టిడిపి నేతలను హౌస్ అరెస్ట్ చేస్తున్నారు.