52 వ రోజు నారా లోకేష్ యువగళం హైలైట్స్

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర సక్సెస్ ఫుల్ గా కొనసాగుతుంది. నేడు సోమవారం 52వ రోజు యువగళం పాదయాత్ర కొండాపురం పంచాయితీ రెడ్డిచెరువుకట్ట వద్ద విడిది కేంద్రం నుంచి ప్రారంభమైంది. అడుగడుగునా కార్యకర్తలు , అభిమానులు , పార్టీ నేతలు లోకేష్ కు బ్రహ్మ రధం పట్టారు. గోరంట్లలో లోకేశ్ కు భారీ స్వాగతం పలికి యాపిల్ తో చేసిన భారీ గజమాలతో సత్కరించారు. హెచ్.పి. పెట్రోల్ బంక్ నుండి బహిరంగ సభ ప్రాంగణం వరకు సుమారు కిలోమీటరు మేర రెడ్ కార్పెట్ పరిచి లోకేశ్ కు కనీవినీ ఎరుగని రీతిలో స్వాగతం పలికారు.

అలాగే మాజీమంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్, అమర్ నాథ్ రెడ్డి, కాల్వ శ్రీనివాసులు, ఎమ్మిగనూరు మాజీ ఎమ్మెల్యే జయనాగేశ్వర్ రెడ్డి, ఇటీవల పార్టీలో చేరిన నెల్లూరు జిల్లా నాయకుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి తదితరులు యువనేతకు సంఘీభావంగా తెలిపారు. గుమ్మయ్యగారిపల్లిలో లోకేశ్ బహిరంగ సభ ఏర్పాటు చేసి..వైస్సార్సీపీ ఫై విమర్శల వర్షం కురిపించారు. “వైస్సార్సీపీ ఎమ్మెల్యేలు, రాష్ట్ర ప్రజలంతా అంటున్నది ఒకటే ఆయన జగన్ కాదు రాష్ట్రానికి పట్టిన జగనోరా. కరోనా కంటే జగనోరా వైరస్ రాష్ట్రానికి ప్రమాదం అని అంటున్నారు. ఈ మాట నేను అనడం లేదు వైస్సార్సీపీ ఎమ్మెల్యేలే అంటున్నారు” అని నారా లోకేష్ తెలిపాడు. యువత భవిష్యత్తు తో జగనోరా ఆటలాడుతున్నాడని లోకేశ్ మండిపడ్డారు. జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు, 2.30 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు, ప్రతి ఏటా 6,500 పోలీసు ఉద్యోగాలు ఇవ్వలేదు, గ్రూప్2 లేదు, డిఎస్సి లేదు అని విమర్శించారు.

ఇక రేపటి పాదయాత్ర షెడ్యూల్ ఇలా ఉంది.

ఉదయం

9.00 – గుమ్మయ్యగారిపల్లి క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం.

10.00 – బాలన్నగారిపల్లి క్రాస్ వద్ద స్థానికులతో మాటామంతీ.

10,20 – మల్లపల్లిలో ఇటుకతయారీ కార్మికులతో భేటీ.

మధ్యాహ్నం

12.30 – పాలసముద్రం క్రాస్ వద్ద బిసిలతో ముఖాముఖి.

1.30 – పాలసముద్రం క్రాస్ వద్ద భోజన విరామం.

2.30 – పాలసముద్రం క్రాస్ వద్ద నుంచి పాదయాత్ర కొనసాగింపు.

2.35 – పాలసముద్రం క్రాస్ వద్ద లాయర్లతో సమావేశం.

2.55 – బెల్లాలచెరువు వద్ద స్థానికులతో మాటామంతీ.

సాయంత్రం

3.30 – మిషన్ తండా వద్ద ఎస్టీ సామాజికవర్గీయులతో భేటీ.

4.25 – ఎస్ఎల్ఎపి కంపెనీ వద్ద స్థానికులతో మాటామంతీ.

6.15 – గుడిపల్లిలో స్థానికులతో మాటామంతీ.

6.50 – నల్లగొండ్రాయనిపల్లి వద్ద యాదవ సామాజికవర్గీయులతో భేటీ.

7.15 – నల్లగొండ్రాయనిపల్లి విడిది కేంద్రంలో బస.