జమ్మూకశ్మీర్‌ ఎన్‌కౌంటర్‌..ఇద్దరు ఉగ్రవాదులు హతం

Jammu and Kashmir encounter..Two terrorists killed

శ్రీనగర్‌ః జమ్మూకశ్మీర్‌లో గురువారం ఉదయం ఎన్‌కౌంటర్‌ జరిగింది. కుప్వారా జిల్లాలో నియంత్రణ రేఖ వెంబడి భారత్‌లోకి చొరబడేందుకు యత్నించిన వారిపై భారత సైన్యం కాల్పులు జరిపింది. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. తంగ్‌ధర్ సెక్టార్‌లోని కంచెకు అవతలివైపు మృతదేహాలు పడి ఉన్నాయి. ఉగ్రవాదుల కోసం ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. కాగా, గత నెలలో కూడా బారాముల్లా జిల్లా ఉరిలో నియంత్రణ రేఖ వెంబడి చొరబాటు ప్రయత్నాన్ని ఆర్మీ తిప్పికొట్టిన విషయం తెలిసిందే. ఆ ఘటనలో ఒక ఉగ్రవాది హతమయ్యాడు.