అజిత్ ధోవ‌ల్‌ను క‌లిసిన‌ కెప్టెన్ అమ‌రీంద‌ర్

ఢిల్లీలో సమావేశం

న్యూఢిల్లీ: పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ జాతీయ భద్రతా సలహాదారు (ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్ తో ఢిల్లీలో సమావేశమయ్యారు. దీంతో ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పటికే పంజాబ్ పీసీసీ మాజీ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూపై అమరీందర్ ఎన్నో ఆరోపణలు చేశారు. పాకిస్థాన్ ఏజెంట్ అని కూడా అన్నారు. ఐఎస్ఐతో సంబంధాలున్నాయనీ ఆరోపించారు. ఈ క్రమంలోనే నిన్న అమిత్ షా, ఇవాళ అజిత్ దోవల్ తో కెప్టెన్ భేటీపై ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు ఆయన బీజేపీలోకి వెళ్తున్నారన్న ఊహాగానాలూ చక్కర్లు కొట్టాయి. పంజాబ్ లో ఎన్నికలు సమీపస్తుండడంతో కొత్త పార్టీ పెట్టి బరిలోకి దిగుతారని మరో చర్చ జరుగుతోంది.

అయితే, అమిత్ షాతో భేటీపై కెప్టెన్ క్లారిటీ ఇచ్చారు. అమిత్ షాతో సాగు చట్టాలపై చర్చించానని ట్వీట్ చేశారు. వెంటనే చట్టాలను రద్దు చేసి రైతులకు న్యాయం చేయాల్సిందిగా కోరానన్నారు. కనీస మద్దతు ధరతో పాటు పంజాబ్ లో పంట మార్పిడికి ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేశానని చెప్పారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/