బీజేపీలో చేరాలని, మాపై ఐటీ దాడులు చేయిస్తున్నారు – మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డి

రెండు రోజుల పాటు మంత్రి మల్లారెడ్డి తో పాటు ఆయన కుమారులు , అల్లుళ్లు ఇళ్లపై ఆఫీసుల ఫై ఐటి అధికారులు దాడులు జరిపి రూ. 10 కోట్లకు పైగా నదగును , విలువైన పత్రాలను స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ దాడుల ఫై మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డి స్పందించారు. టర్కీ పర్యటన నుండి ఈరోజు హైదరాబాద్ కు వచ్చిన రాజశేఖర్ రెడ్డి..ఎయిర్ పోర్ట్ లో మీడియా తో మాట్లాడారు.

ఐటీ అధికారులు మా కూతురు, తల్లిదండ్రులు తో అమానుషంగా ప్రవర్తించారు.. నేను టర్కీ నుండి వచ్చిన తరువాత మా కూతురు తో మాట్లాడినానని వెల్లడించారు. ఇంట్లో ఉన్న ఒక అమ్మాయి తో అధికారులు ప్రవర్తించిన తీరు సరిగ్గా లేదని.. ఈడీ, ఐటీ , సీబీఐ తో దాడులు చేయించి బయ పెడుతున్నారని చెప్పారు. మా ఇంట్లో సోదాలు 4 కోట్లు నగదు సీజ్ చేశారు.. మా తల్లిదండ్రులు , కూతురు పై ఐటీ అధికారులు ప్రవర్తించిన తీరుపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తామన్నారు. మేము ప్రతి ఏడాది మేము ఐటీ రిటర్న్స్ చెల్లిస్తున్నామని.. మేము ఐటీ అధికారులు దాడులు చేసుకొచ్చు, కానీ పద్ధతి ఉండాలని పేర్కొన్నారు. ఇప్పటకే మూడు సార్లు సోదాలు చేశారు, కానీ ఎప్పుడు కుడా ఇలా ఐటీ అధికారులు అమానుషంగా ప్రవర్తించ లేదని అన్నారు.