జైలులో ఖైదీల మధ్య ఘర్షణ..116 మంది మృతి

క్విటో: ఈక్వెడార్ దేశంలోని పెనిటెన్షియారియా డెల్ లిటోరల్ జైలులో ఖైదీల మధ్య జరిగిన ఘర్షణలో మృతుల సంఖ్య వంద దాటింది. ఈక్వెడార్‌లోని గుయాక్విల్ జైలులో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు బాంబులు, తుపాకులతో దాడి చేసుకున్నారు. ఈ ఘర్షణలో ఇప్పటివరకు 116 మంది ఖైదీలు మరణించారని అధికారులు మరణించారని అధికారులు తెలిపారు.

జైలులో జరిగిన ఈ ఘర్షణ దేశ చరిత్రలో అత్యంత హీనమైనదిగా మిగిలిపోతుందని చెప్పారు. గుయాక్విల్‌ జైలో శిక్ష అనుభవిస్తున్న రెండు డ్రగ్‌ గ్యాంగుల మధ్య వివాదం చెలరేగింది. అదికాస్తా ఘర్షణకు దారితీసింది. దీంతో జైలు బాంబులు, తుపాకుల మోతలతో దద్దరిల్లింది. ఈ ఘర్షణను అదుపుచేయడానికి 400 మంది పోలీసులు, మిలటరీ 5 గంటలపాటు శ్రమించాల్సి వచ్చింది.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/