వైఎస్‌ఆర్‌సిపి ప్రాథమిక సభ్యత్వానికి సి.రామచంద్రయ్య రాజీనామా

ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేస్తానని వెల్లడి

c-ramachandraiah-resigns-to-ysrcp

అమరావతిః వైఎస్‌ఆర్‌సిపి ని వీడుతున్న నేతల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే పలువురు నేతలు పార్టీని వీడారు. తాజాగా వైఎస్‌ఆర్‌సిపి ప్రాథమిక సభ్యత్వానికి సీనియర్ నేత, ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని ముఖ్యమంత్రి జగన్ కు పంపారు. వైఎస్‌ఆర్‌సిపి అప్రజాస్వామిక విధానాలు నచ్చకే పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసినట్టు లేఖలో ఆయన పేర్కొన్నారు. తన రాజీనామాను వెంటనే ఆమోదించాలని కోరారు. ఇటీవలే టిడిపి అధినేత చంద్రబాబు సమక్షంలో ఆ పార్టీలో రామచంద్రయ్య చేశారు.

మరోవైపు ఆయన మీడియాతో మాట్లాడుతూ… వైఎస్‌ఆర్‌సిపి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన తర్వాత ఎమ్మెల్సీ పదవిలో కొనసాగడం భావ్యం కాదని అన్నారు. అందుకే మరో మూడేళ్లు పదవీ కాలం ఉన్నప్పటికీ రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. మండలి ఛైర్మన్ ను కలిసి రాజీనామా సమర్పిస్తానని తెలిపారు. వైఎస్‌ఆర్‌సిపిలో కొన్ని నెలలుగా చాలా ఇబ్బంది పడుతున్నానని చెప్పారు. రాష్ట్రంలో ఏం జరుగుతోందో జగన్ తెలుసుకోవాలని సూచించారు. సలహాదారులు జగన్ కు ప్రజాభిప్రాయాలను కరెక్ట్ గా చెబితే బాగుంటుందని అన్నారు.