యుపిఎ పగ్గాలపై ఆసక్తిలేదు

ఎన్‌సిపి అధినేత శరద్‌పవార్‌

Sharad Pawar
Sharad Pawar

New Delhi: యుపిఎ ఛైర్‌పర్సన్‌ కావాలన్న ఆసక్తి తనకులేదని ఎన్‌సిపి అధినేత శరద్‌పవార్‌ స్పష్టంచేసారు. రైతుల ఆందోళనలపైనే సోమవారం ప్రతిపక్ష నేతలందరితో సమావేశం అవుతామని వెల్లడించారు.

అలాంటి ఆసక్తితమ అధినేతకు లేదని వెల్లడించింది. అంతేకాకుండా సోనియా నుంచి శరద్‌పవార ్‌యుపిఎ పగ్గాలు తీసుకంటారనడం కూడా వాస్తవం కాదని కొట్టివేసింది. ఇపుడు పవార్‌ స్వయంగా ఆదివారం తనకు ఆసక్తిలేదని స్పష్టంచేసారు. ప్రస్తుతం ఢిల్లీలో కొనసాగుతున్న రైతు ఆందోళనలపై చర్చించేందుకు ఆయన ఢిల్లీకి ిబయలుదేరి వెళుతున్నారు.

యుపిఎ ఛైర్‌పర్సన్‌గా కొనసాగాలన్న ఆసక్తి తనకు లేదని, అలాటి ప్రతిపాదన కూడా ఏదీ లేదని పవార్‌ మీడియాకు స్పష్టంచేసారు. పవార్‌ 80వ జయంతి సందర్భంగా ఎన్‌సిపి నేత ప్రఫుల్‌ పటేల్‌ మాట్లాడుతూ మరాఠా యోధుడు మిత్రపక్షంలోని దర్బార్‌కోటరీ వల్లనే 1990లో దేశప్రధాని కాలేకపోయారని పేర్కొన్నారు.

అనంతరం శివసేన నేత సంజ§్‌ురౌత్‌ వ్యాఖ్యలు ఇందుకు మరింత ఆజ్యం పోసాయి. రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చని, సేన ఎన్‌సిపి కాంగ్రెస్‌ హయాంలో భవిష్యత్‌ దేశరాజకీయాలు సైతం మారవచ్చని పేర్కొన్నారు.

80వ వడిలో ప్రవేశించిన పవార్‌ దేశలో కీలకపాత్ర పోషించేందుకు అర్హులైన వ్యక్తి అని సమర్ధుడైన నేత అని పేర్కొన్నారు. రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేని, అనూహ్య పరిణామాలు జరుగుతాయని శివసేన ఎంపి సంజ§్‌ురౌత్‌ పేర్కొనడం కూడా పవార్‌ భవిష్యత్తు రాజకీయంపై అంచనాలను పెంచింది. అయితే తనకు యుపిఎ ఛైర్మన్‌ చేపట్టాలన్న ఆసక్తిలేదని పవార్‌ స్పష్టం చేయడంతో ఈ వివాదానికి తెరపడింది.

తాజా కెరీర్‌ సమాచారం కోసం : https://www.vaartha.com/specials/career/