అసలే ఇది వేసవి.. ఉదయాన్నే మజ్జిగ తాగండి

ఆహారం , అలవాట్లు, ఆరోగ్యం

వేసవితాపాన్ని తగ్గించే వాటిల్లో మజ్జిగ ముందు ఉంటుంది.. అంతేకాదు బరువు నియంత్రణలో ఉంచుతూ కడుపును చల్ల బరుస్తుంది.. ఇంకా మజ్జిగ తాగితే ఏమేం ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందాం…

Health with a glass of buttermilk daily
Health with a glass of buttermilk daily

మజ్జిగలో పొటాషియం, కాల్షియం, విటమిన్ బి కాంప్లెక్స్ వంటి పోషకాలు ఎక్కువ . రోజూ ఉదయాన్నే ఒక గ్లాసు మజ్జిగ తీసుకుంటే కావాల్సిన శక్తి అందుతుంది.. మజ్జిగలో కెలోరీలు కొవ్వు శాతం తక్కువ కాబట్టి బరువు తగ్గాలనుకునే వారు మజ్జిగ తాగితే మంచిది..

మజ్జిగలో కొద్దిగా అల్లం రసం కలిపి తాగితే అతిసారం తగ్గుతుంది.. దీనిలోని లాక్టోజ్ , కార్బోహైడ్రేట్స్ రోగనిరోధక శక్తిని పెంచుతాయి.. అదే పటిక బెల్లంతో కలిపి తీసుకుంటే పైత్యం తగ్గుతుంది.. దీన్ని తాగటం వలన జీర్ణాశయం , పేగుల్లో ఉండే హానికర బ్యాక్టీరియా నశించి బ్యాక్టీరియా వృద్ధి తగ్గుతుంది.. ఎండా కాలంలో వచ్చే డీహైడ్రేషన్ సమసిహ తగ్గాలంటే మజ్జిగ తాగితే సరి.. అధిక రక్తపోటు ఉన్నవారు రోజూ ఉదయం ఉప్పు లేకుండా మజ్జిగ తాగితే రక్తపోటు అదుపులో ఉంటుంది..

‘నాడి’ (ఆరోగ్య విషయాలు) వ్యాసాలకు: https://www.vaartha.com/specials/health1/