థైరాయిడ్ కు చెక్ చెబుదాం!

మహిళలు- ఆరోగ్య సమస్యలు

Thyroid Problems – Prevention

నేడు చాలా మంది మహిళలను వేధిస్తున్న సమస్యల్లో థైరాయిడ్ ఒకటి.. ఈ గ్రంథిలో అపసవ్యాలు ఇతర అనారోగ్యాలకూ దారి తీస్తాయి.. అందుకే నివారణోపాయంగా పూర్ణ భుజంగాసనం వేసి చూడండి..

బోర్లా పడుకుని రెండు కాళ్ళూ దగ్గరగా ఉంచాలి… రెండు చేతులూ ఛాతీ పక్కన ఉంచి అరచేతులను నేలమీద ఆనించాలి.. చేతుల మీద బరువు వేస్తూ భుజాలను పైకి లేపాలి. తలను వీలైనంత వెనక్కి వంచాలి… రెండు కాళ్లనూ మడిచి తాకేలా పైకి తీసుకు రావాలి. కాళ్ళు వంచలేక పొతే వచ్చినంత వరకే తీసుకెళ్లండి.. మొదట్లో తలకూ, పాదాలకూ మధ్య దూరం ఎక్కువగా ఉన్నా క్రమంగా తగ్గి ఆనించి గలుగుతారు..

ప్రయోజనాలు:

థైరాయిడ్ సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది.. వెన్నెముక బలపడుతుంది. స్పాండిలైటిస్, ఆర్థరైటిస్ లను తగ్గిస్తుంది..మెడ , ఉదర భాగం, ఊపిరితిత్తులు, భుజాలు, పొత్తి కడుపు వద్ద ఒత్తిడి తగ్గి ఆ భాగాలు చురుగ్గా పనిచేస్తాయి. కండరాలు ఉత్తేజితమవుతాయి..

బరువు తగ్గుతుంది.. నెలసరి ఇబ్బందులు నుంచి ఉపశమనం పొందవచ్చు.. విసుగు, కోపం, ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి..
రక్త సరఫరా సాఫీగా ఉంటుంది.. జీర్ణ ప్రక్రియ బాగుంటుంది.. గుండె, ఊపిరి తిత్తుల పనితీరు మెరుగవుతుంది.. నడుము, వెన్ను నొప్పులకు స్వస్తి చెప్పొచ్చు.. ఉబ్బసానికి చికిత్స లా పనిచేస్తుంది.

మరిన్ని ఆరోగ్య సంబంధిత విశేషాల కోసం ‘నాడి’ క్లిక్ చేయండి : https://www.vaartha.com/specials/health1/