ఆరోగ్యానికి ఘీ కాఫీ !

ఆరోగ్యం – అలవాట్లు

Ghee coffee for health
Ghee coffee for health

బ్లాక్ కాఫీ, చాక్లెట్ కాఫీ, కోల్డ్ కాఫీ… అంటూ బోలెడు కాఫీలు తాగుతుంటారు.. మరి ఘీ కాఫీ? కాఫీ లో నెయ్యి ఏంటి? అని ఆశ్చర్యపోకండి.. ఆరోగ్యానికి ఇది మంచిది.. అని నిపుణులు చెబుతున్నారు.

అమ్మాయిలు, మహిళల్లో హార్మోనుల్లో అసమతుల్యత పెద్ద సమస్య.. ఘీ కాఫీ ఆ సమస్యను అదుపులోకి తేవటంలో సాయపడుతుందని చెబుతున్నారు. ఆరోగ్యం బాగుండాలి, బరువు తగ్గాలి అని అనుకునే వారికి ఘీ కాఫీ ఉత్తమ ఎంపిక… కప్పు కాఫీలో టేబుల్ స్పూన్ నెయ్యి కలిపి పరగడుపున తీసుకోమంటున్నారు.. దీనివల్ల తర్వాత ఏం తీసుకున్న శరీరంలో ఇన్సులిన్ శాతం పెరగకుండా చూసుకుంటుంది.. మధుమేహం, మెటబాలిజమ్ సమస్యలున్నా వారు దీన్ని ప్రయత్నించవచ్చు.. కెఫిన్ తో కొందరిలో ఆందోళన వంటివి పెరుగుతాయట.. అలాంటి వాటిని నెయ్యి తగ్గిస్తుంది..

నెయ్యి ఆహారాన్ని తేలిగ్గా జీర్ణం చేయటమే కాదు. త్వరగా శక్తిని ఇస్తుంది.. దీన్ని కొవ్వు పదార్థంగా చూస్తాం .. కానీ, జీర్ణ ప్రక్రియను మెరుగు పరుస్తూ శరీరంలో పేరుకున్న కొవ్వును తగ్గిస్తుంది.. అలా బరువుని అదుపు చేయటంలోనూ సాయపడుతుంది.. పాలు, నెయ్యి పడని వారు మాత్రం డైటీషియన్ సలహా తీసుకోవటం మంచిది..

మెటబాలిజం మెరుగుపడాలంటే ఉదయాన్నే కొవ్వు, ప్రోటీన్లతో కూడిన ఆహారంతో మొదలు పెట్టాలంటారు. అలాంటివారూ ఘీ కాఫీని పరగడుపున ఎంచుకోవచ్చన్న మాట.. వ్యాయామానికి ముందు దీన్ని తీసుకుంటే శరీరానికి ఇంధనంగా పనిచేస్తుంది.. అయితే రోజులో రెండుసార్లు కు మించి మాత్రం ఈ కాఫీ వద్దు. ముఖ్యంగా , సాయంత్రం 5 గంటల తర్వాత దీన్ని తీసుకోవద్దు.. ఇది నిద్ర లేమికి కారణం అవుతుందట.

‘నాడి ‘ (ఆరోగ్య సలహాలు, సూచనలు) కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/specials/health1/