రేవ్ పార్టీ కేసులో నటి హేమకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్

Bengaluru rave party case..Notices to actress Hema
Bengaluru rave party case..Notices to actress Hema

బెంగుళూర్ రేవ్ పార్టీ లో పోలీసులకు అడ్డంగా దొరికిన టాలీవుడ్ నటి హేమకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది కోర్ట్. ఈ కేసులో సోమవారం హేమను అరెస్ట్ చేసిన బెంగుళూరు సీసీబీ పోలీసులు వైద్య పరీక్షల అనంతరం రాత్రి ఆమెను మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. దీంతో హేమకు మేజిస్ట్రేట్ 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో పోలీసులు ఆమెను జైలుకు తరలించారు.

గత నెల 20వ తేదీన బెంగుళూరులోని ఓ ఫామ్ హౌస్‌లో జరిగిన రేవ్ పార్టీకి నటి హేమతో పాటు టాలీవుడ్‌కు చెందిన పలువురు నటులు హాజరైన విషయం తెలిసిందే. ఈ పార్టీకి సంబంధించి దాదాపు 150 మందిపై సీసీబీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో డ్రగ్స్ సేవించారన్న అనుమానంతో 103 మంది నుండి బ్లడ్ శాంపిల్స్ సేకరించి పరీక్షలకు పంపారు. వీరిలో 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్థారణ అయ్యింది. హేమ కూడా ఈ పార్టీలో డ్రగ్స్ తీసుకున్నట్లు తేలింది. దీంతో విచారణకు హాజరు కావాలని పోలీసులు హేమకు రెండు సార్లు నోటీసులు జారీ చేశారు. వివిధ కారణాలతో రెండు సార్లు పోలీసుల దర్యాప్తుకు హేమ హాజరుకాలేదు. దీంతో మరోసారి పోలీసులు ఆమెకు నోటీసులు ఇవ్వగా.. మూడోసారి హాజరయ్యారు. విచారణ అనంతరం ఆమెను అదుపులోకి తీసుకున్నారు.