రేపటినుంచే పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు

Parliament of India
Parliament of India

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు రేపటినుంచి ప్రారంభం కానున్నాయి. ఆనవాయితీ ప్రకారం భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రసంగం అనంతరం బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం అవుతాయి. మరోవైపు నేడు అన్ని పార్టీలు కలిసి అఖిలపక్ష సమావేశాలు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. రేపటి నుంచి సరిగ్గా 12 రోజులపాటు సాగే ఈ సమావేశాలు ఫిబ్రవరి 11 వరకు కొనసాగుతాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంట్‌లో దేశ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/