చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడుతున్నారు

రాజధానిపై చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే నోటీఫికేషన్‌ ఎందుకు విడుదల చేయలేదు?

mla roja
mla roja

అమరావతి: ఇవాళ ఉదయం తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న వైఎస్సార్‌సిపి ఎమ్మెల్యే రోజా శాసన మండలి రద్దుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు శాసన మండలి రద్దు అవుతుందని అన్నారు. ఇంకా దర్శనం అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ..చంద్రబాబు రాష్ట్ర అభివృద్దికి అడ్డుపడుతున్నారని రోజా విమర్శించారు. అమరవతి రాజధానిపై చంద్రబాబుకి చిత్తశుద్ధి ఉంటే ఆయన గతంలో ఎందుకు నోటిఫికేషన్‌ విడుదల చేయలేదని నిలదీశారు. ఏపీలో మూడు రాజధానులు ఏర్పాటు అవుతాయని రోజా స్పష్టం చేశారు. దీంతో పాటు శాసనమండలి కూడా రద్దు అవుతుందన్నారు. కరోనా వైరస్‌ ప్రభావంతో చైనాలో చిక్కుకుపోయిన 58 మంది తెలుగు ఇంజనీర్లను భారత్‌కు తీసుకురావడానికి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ఈ వ్యాధిపై ఎవరూ ఆందోళన చెందవద్దని తెలిపారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/