కొడాలి నాని గురించి కొన్ని విషయాలు బయటపెడతా : బుద్ధా వెంకన్న

కొడాలి నానికి వార్నింగ్ ఇచ్చిన బుద్ధా వెంకన్న

Buddha venkanna
Buddha venkanna

అమరావతిః వైఎస్‌ఆర్‌సిపి ఎమ్మెల్యే, మాజీమంత్రి కొడాలి నాని నిన్నటిడిపి అధినేత చంద్రబాబుపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. సీనియర్ ఎన్టీఆర్, హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ లను ప్రస్తావిస్తూ చంద్రబాబుపై నిప్పులుచెరిగారు. దీనిపై టిడిని సీనియర్ నేత బుద్ధా వెంకన్న స్పందించారు.

చంద్రబాబుపై కొడాలి నాని అనవసర విమర్శలు మానుకోవాలని హెచ్చరించారు. లేకపోతే కొడాలి నానిని పోస్టుమార్టం చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. హరికృష్ణ, వైఎస్‌ఆర్‌ లలో ఎవరు గొప్ప అంటే నాని ఏం సమాధానం చెబుతారని బుద్ధా వెంకన్న ప్రశ్నించారు. వైఎస్‌ఆర్ చనిపోయినప్పుడు కొడాలి నాని తదితరులు ఏంచేశారో త్వరలోనే బయటపెడతానని వెల్లడించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/