లోకేష్ కు ప్రాణ హాని ఉందంటూ బుద్దా వెంకన్నఅనుమానాలు

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈ నెల 27 నుండి ‘యువగళం‘ పేరుతో పాదయాత్ర చేయబోతున్నారు. ఈ యాత్ర ని టీడీపీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీనికి సంబంధించి భారీ యాక్షన్ ప్లాన్.. రూట్ మ్యాప్ కూడా రెడీ చేశారు. అయితే నారా లోకేశ్ లకు ప్రాణ హాని ఉందని ఆ పార్టీ నేత, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆందోళన వ్యక్తం చేశారు. లోకేశ్ పాదయాత్ర ఈ నెల 27న మొదలవుతుందని చెప్పారు. లోకేశ్ తమ టార్గెట్ అని సీఎం జగన్ అన్నారని… లోకేశ్ పై దాడులు చేస్తారనే అనుమానాలు ఉన్నాయని అన్నారు.


కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని, ప్రత్యేక బలగాలతో లోకేశ్ కు భద్రత కల్పించాలని కోరారు. లోకేశ్ పాదయాత్రను అడ్డుకునే ప్రయత్నం చేస్తే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. పాదయాత్రను జీవో నెంబర్ 1తో అడ్డుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఇక లోకేష్ రోజుకు 10 కిలో మీటర్ల చొప్పున 400ల రోజుల పాటు 4 వేల కిలో మీటర్లు పాదయాత్ర చేయటానికి రూట్ మ్యాప్ ఖారారు అయ్యింది. కుప్పం నుండి లోకేష్ పాదయాత్ర మొదలుకాబోతుంది.