లోకేశ్ సహా శాసనసభా పక్ష నేతల ఆందోళన
ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను నింపాలని నిరసన

అమరావతి : హామీ ఇచ్చినట్టుగా ఉద్యోగాలను భర్తీ చేయాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా టీడీపీ శాసనసభా పక్ష నేతలు నిరసన తెలియజేశారు. సీఎం హామీ ఇచ్చినట్టు భర్తీ చేస్తామన్న 2.30 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. జాబులు ఎక్కడ జగన్ రెడ్డి? అంటూ బ్యానర్ ను ప్రదర్శించారు. ఈ నిరసన కార్యక్రమంలో నారా లోకేశ్, అచ్చన్నాయుడు, అశోక్ బాబు తదితర నేతలు పాల్గొన్నారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/telangana/