ఆస్కార్ రేసులో ఎన్టీఆర్…

యావత్ సినీ స్టార్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే అవార్డ్స్ ఆస్కార్ అవార్డ్స్. ఆస్కార్ బరిలో ఒక్కసారైనా నిలువాలని కోరుకుంటారు. టాలీవుడ్ , బాలీవుడ్ , హాలీవుడ్ ఇలా అన్ని ఇండస్ట్రీ నటి నటులంతా ఆస్కార్ కోసం తపిస్తుంటారు. అలాంటిది ఇప్పుడు మన టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి ఆస్కార్ బరిలో ఎన్టీఆర్ నిలిచినట్లు తెలుస్తుంది.

దర్శక ధీరుడు రాజమౌళి బాహుబలి తో తెలుగు సినిమా సత్తా ను ప్రపంచానికి చాటి చెప్పగా..ఇప్పుడు ఆర్ఆర్ఆర్ తో మరోసారి తెలుగు ఇండస్ట్రీ గురించి హాలీవుడ్ అగ్ర దర్శకులు మాట్లాడుకునేలా చేయడమే కాదు ఏకంగా ఆస్కార్ బరిలో నిలిచేలా చేసాడు. ఆర్ఆర్ఆర్ రిలీజ్ కు ముందు..రిలీజ్ తర్వాత కూడా అనేక అవార్డ్స్ ను తన ఖాతాలో వేసుకుంటూ వస్తుంది. పలు జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలను ఆర్ఆర్ఆర్ సొంతం చేసుకుంది. ఈ సినిమాలో నటించిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ పేర్లు ప్రపంచ వ్యాప్తంగా మార్మోగాయి. ముఖ్యంగా ఈ చిత్రంలో ఎన్టీఆర్ పలికించిన హావభావాలకు పిచ్చి క్రేజ్ వచ్చింది. ఆర్​ఆర్​ఆర్​లో యాక్షన్‌ సీన్స్‌లోనే కాకుండే ఎమోషనల్‌ పరంగానూ తారక్‌ నటన కంటతడి పెట్టించింది. దీంతో ఆస్కార్‌ రేసులో ఉత్తమ నటుడి విభాగంలో తారక్‌ నిలుస్తారని భావిస్తున్నారు.

ఇక ఇప్పటికే ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు సాంగ్ కు గోల్డెన్ గ్లోబ్ అవార్డు మాత్రమే కాదు క్రిటిక్స్ ఛాయిస్ పురస్కారాల్లో కూడా ఈ సినిమా అవార్డును సొంతం చేసుకోవడం గమనార్హం. ఇదిలా ఉండగా త్వరలో మార్చి 12 న యూఎస్ లో అట్టహాసంగా జరగనున్న ఆస్కార్ అవార్డుల్లో కూడా ఆర్ఆర్ఆర్ నామినేషన్స్ దక్కించుకోవడం విశేషం. ఫైనల్ గా జరిగిన ఆస్కార్ షార్ట్ లిస్టులో ఆర్ఆర్ఆర్ స్థానాన్ని దక్కించుకోవడంతో ఆస్కార్ అవార్డుల్లో పోటీపడే అర్హతను దక్కించుకుంది. ఈ నేపథ్యంలోనే ఆర్ఆర్ఆర్ కు గాను హీరో ఎన్టీఆర్ పేరు ఇప్పుడు ప్రముఖంగా వినిపిస్తూ ఉండడం గమనార్హం. పలు అంతర్జాతీయ వార్తా సంస్థలు ఆస్కార్ రేసులో ఎన్టీఆర్ పేరును ప్రముఖంగా ప్రస్తావించడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.