ట్విట్టర్లో కూత పెట్టే పక్షి మౌన వ్రతం పాటిస్తోంది
జగన్ ఫిర్యాదులకు విజయసాయి అనుకూలమా?..బుద్దా వెంకన్న

అమరాతి: టిడిపి నేత బుద్దా వెంకన్న వైఎస్ఆర్సిపి ఎంపి విజయసాయిరెడ్డిపై మరోసారి విమర్శలు గుప్పించారు. జడ్జీలపై ముఖ్యమంత్రి జగన్ ఫిర్యాదు చేసినప్పటి నుంచి విజయసాయిరెడ్డి మైకు ముందుకు రావడమే మానేశారని బుద్ధా ఎద్దేవా చేశారు. ఏం జరిగినా ‘జై జగన్’ అంటూ ట్విట్టర్లో కూత పెట్టే పక్షి ఇప్పుడు మౌన వ్రతం పాటిస్తోందని అన్నారు. చిట్టి గుండె, చిన్న మెదడు భయంతో వణుకుతున్నాయా? అని ప్రశ్నించారు. ఇంతకూ జగన్ చేసిన ఫిర్యాదులకు విజయసాయిరెడ్డి అనుకూలమా? లేక వ్యతిరేకమా? నోరు తెరిచి చెప్పండని డిమాండ్ చేశారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/